విశ్వసనీయతను పెంపొందించాలని సబ్ కలెక్టరు ఇలాక్కియా

TV77తెలుగు రాజమహేంద్రవరం: సోమవారం స్థానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో సుమారు 18 మంది అర్జీదారులు తమ తమ సమస్యలను వ్రాత పూర్వకంగా సబ్ కలెక్టరుకు అందించారు. గ్రామీణ మండలం దవళేశ్వరం గ్రామానికి చెందిన వై వెంకటేష్ గ్రామంలో పందులు విచ్చలవిడి తిరుగుతూ ఇళ్ళలోనికి చొరబడుతున్నాయని వాటిని కట్టడి చేయాలని సబ్ కలెక్టరు వారిని కోరారు. రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామానికి చెందిన ఆకుల సత్యనారాయణ పొలం వెళ్లే దారికి అటంకాలు కల్పించడం జరుగుతోందని ఆ సమస్యను పరిష్కరించాలని సబ్ కలెక్టరు వారిని ఆశ్రయించారు. బాబా నగర్ కు చెందిన వంగా సీతారామిరెడ్డి ఫింగరు ప్రింట్సు స్కానింగు కావడం లేదని దయతో ఫించన్ ఆగిపోకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. కోరుకొండ మండలం కనుపూరుకు చెందిన నాగసూరి పత్తిరాజు విశ్రాంత ఉ పాధ్యాయుడు కోవిడ్-19 వైద్యం చేయించుకున్నానని వైద్య ఖర్చులు రియంబర్సుమెంటు బిల్లులు మంజూరు చేయాలని కోరారు. గోకవరం మండలం అచ్యుతాపురంకు చెందిన కె అప్పారావు తన భూమికి సరిహద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆనందనగర్‌కు చెందిన నాయుడు పద్మ ప్రక్క ఇంటి వారు తనకు దారి లేకుండా ప్రభుత్వ స్థలంలో గోడ కడుతున్నారని వెంటనే ఆపాలని కోరారు. సుబ్బారావు నగర్ కు చెందిన ఇంజరపు వీరవెంకట దుర్గా సత్యవతి ఇంటి తగాదా పరిష్కరించాలని కోరారు.మాధవరాయుడుపాలెంకు చెందిన మహిల తన భూమిలోనుంచి గ్యాస్ పైపులైన్ వెళ్లందని నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. పైన తెలిసిన సమస్యలను ఆయా శాఖాధికారులకు పంపించి పూర్తిగా విచారించిన పిమ్మట నిబంధనలకు లోబడి తగు పరిష్కార మార్గాలు పూర్తి స్థాయిలో చూపడం జరుగుతుందని సబ్ కలెక్టరు అర్జీదారులకు విన్నవించారు.