చోరీ చేసే ముఠా గుట్టు రట్టు చేసిన అరండల్ పేట పోలీసులు

TV77తెలుగు గుంటూరు: 
గుంటూరు నగరంలో ద్విచక్ర వాహనాలు చోరీ చేసే ముఠా గుట్టు రట్టు చేసిన అరండల్ పేట పోలీసులు. బ్యాంక్ ఉద్యోగిగా చేస్తూ ద్విచక్ర వాహనాల దొంగతనాలను చేస్తూ, దొంగతనం చేసిన వాహనాలను ప్రత్యేకంగా షోరూం లలో మాత్రమే అమ్ముతాడు.హాస్పటల్స్, రద్దీగా ఉండే ప్రాంతాలలో వాహన దొంగతనాలు చేస్తూ ఉంటారు.ఉన్నత విద్య అభ్యసించి బ్యాంక్ ఉద్యోగిగా చేస్తూ చెడు అలవాట్లకు లోనై ఇలా దొంగతనాలకు అలవాటు పడ్డాడు.ఎనిమిది ద్విచక్ర వాహనాలు,వీటి విలువ4లక్షల రూపాయలు ఉంటుందని వెస్ట్ డిఎస్పీ సుప్రజా తెలిపారు.