నడి రాత్రిలో ఘాడ నిద్ర లో ఉండగా కట్టుకున్న ఇళ్ల కుప్పకూలిపోయింది
iraila 07, 2021
TV77తెలుగు మైలవరం:
కృష్ణా జిల్లా..
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న ఒక భూ వివాదం కారణంగా సామాన్య ప్రజలు నలిగిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.. కొండపల్లి బ్యాంక్ సెంటర్ లో ఒక భూమి వివాదాల కారణంగా అధికారులు నిర్మాణం పనులు నిలిపివేశారు.. అయితే నిర్మాణం కోసం తవ్విన 12 అడుగుల మేర గొయ్యి స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.. ఇదే విషయం పై అధికారులు స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలని స్థానికులు పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు..అయిన స్పందించకపోవడం తో మీడియా ముఖంగా ద్వారా తమ గోడు జిల్లా అధికారులకు వినిపించే ప్రయత్నం చేశారు... అయినా అధికారులు పట్టించుకోక పోవడం తో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. ఏదైతే జరగకూడదని స్థానికులు కన్నీటితో వేడుకున్నారో అదే జరిగింది... తమ ఆందోళన అధికారులకు వినిపించినా సరే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వలన కష్టపడి కట్టుకున్న గూడు కుప్పకూలిపోయింది.. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితానికి తీరని నష్టాన్ని మిగిల్చింది.. అదృష్టం కొద్ది ఇంట్లో పిల్లలకు, పెద్దలకు ఎలాంటి గాయాలు లేకుండా భయటపడగా ఇల్లు కూలి బ్రతుకులు రోడ్డున పడ్డాయి.. దీనికి భాద్యత ఎవరు తీసుకుంటారు.. భూ వివాదం కారణంగా నష్టపోయిన ఆ భాధిత కుటుంబానికి న్యాయం ఎవరు చేస్తారు.. మిగిలిన కుటుంబాల మనో వేదన అరణ్య రోదన మిగిలిపోవాల్సిందేనా... ఆ అగాధం అంచున ఉన్న మరిన్ని కుటుంబాల ఇల్లు నేలమట్టం అయ్యేదాకా స్పందించారా...