భూపాలపట్నం లో భూ రక్ష సర్వే ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
iraila 06, 2021
TV77 తెలుగు రాజానగరం: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షా పథకాన్ని ప్రవేశపెట్టిందని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా అన్నారు. సోమవారం నాడు రాజానగరం మండల పరిధిలోని పైలెట్ గ్రామమైన భూపాలపట్నంలో చేపట్టిన గ్రౌండ్ వాల్యుయేషన్ పక్రియలో భాగంగా సంబంధిత అధికారులతో కలిసి భూపాలపట్నం సచివాలయంలో సమావేశమై, సంబంధిత అధికారుల నుంచి సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు వివాదాలు లేని ఆస్తిని అందించేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందన్నారు భూ వివాదాల కు చెక్ పెట్టేందుకు సర్వే ఆఫ్ ఇండియా వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.బ్రిటిష్ హయాంలో జరిగిన సర్వే తర్వాత మరల ఇప్పుడే రీసర్వే జరుగుతోందన్నారు.ఈ సర్వే ద్వారా అన్యాక్రాంతమైన భూములు ప్రవేట్ ప్రభుత్వ భూములు గ్రామ కంఠం భూములు అదేవిధంగా గ్రామాలు సబ్ డివిజన్ సరిహద్దులు స్పష్టంగా తెలుసుకునేందుకు ఈ ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుందన్నారు.భూరికార్డుల స్వచ్ఛకరణకు ఈ సర్వే ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఈ సర్వే ద్వారా రైతులు భూమి యజమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని,ఈ సర్వేలో అన్యాక్రాంతమైన భూములను గుర్తించి అవి ఎవరికి చెందినవొ వారికి తిరిగి అప్పగించడం జరుగుతుందన్నారు.గతంలోకన్నా భిన్నంగా ఈ సర్వేకు జిపిఎస్ కోఆర్డినేట్స్,డ్రోన్స్ ఫ్లయింగ్, రోవర్ఎక్స్ వంటి అధునాతన పరికరాలు జోడించి పూర్తి కచ్చితత్వంతో సర్వే నిర్వహించడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి భూ సమస్యలు తలెత్తవని ఆయన అభిప్రాయపడ్డారు.సర్వే చేసే సమయంలో ఏవైనా భూ సమస్యలు ఉన్నయెడల మొబైల్ మండల్ మెజిస్ట్రేట్ టీమ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో రాజానగరం తాసిల్దార్ జి.బాలసుబ్రమణ్యం,కడియం తాసిల్దార్ భీమారావు, డిప్యూటీ తాసిల్దార్ దివ్యభారతి, ఆర్.ఐ రాజశేఖర్,సర్వేయర్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.