అక్రమ మద్యం పట్టివేత ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్
iraila 17, 2021
TV77తెలుగు దాచేపల్లి:
గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణంలోని తంగెడ రోడ్డులో అజ్ఞాత వ్యక్తుల సమాచారం మేరకు వాహనాల తనిఖీలు నిర్వహించగా తుఫాను వాహనంలో తరలిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 26 కేసులను అక్రమ మద్యాన్ని గుర్తించిన పోలీసులు దాచేపల్లి కి చెందిన ఓవ్యక్తి మరో వ్యక్తి తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు పేర్కొన్నారు.అక్రమంగా తరలిస్తున్న మద్యం కేసులను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్లు గురజాల రూరల్ సిఐ ఉమేష్ పేర్కొన్నారు.ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తుల పై కేసులు నమోదు చేసి ఇలాంటి అక్రమ మద్యం గుట్కా చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వ్యక్తులపై పిడియాక్ట్ అమలు చేయాల్సి వస్తుందని గురజాల రూరల్ సీఐ ఉమేష్ హెచ్చరించారు.ఈ సమావేశంలో దాచేపల్లి ఎస్ఐ బాలనాగిరెడ్డి, ఎస్ ఐ రహంతుల్లా పాల్గొన్నారు.