గంజాయి తరలిస్తున్న వ్యాన్ డ్రైవర్‌ను అరెస్ట్
iraila 17, 2021
TV77తెలుగు కొవ్వూరు:
తెలంగాణకు తరలిస్తున్న 589.94 కేజీల గంజాయిని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గంజాయి తరలిస్తున్న వ్యాన్, డ్రైవర్‌ను అరెస్టుచేశారు.రూరల్ పోలీస్టేషన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.శ్రీనాథ్ వివరాలు తెలిపారు.ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఆదేశాలతో జాతీయ రహదారిపై కాపవరం వద్ద గురువారం రూరల్ సిఐ వైవీ.రమణ,ఎస్‌ఐ కె.వెంకటరమణలు సిబ్బందితో వాహన తనిఖీ చేపట్టారు.కొవ్వూరు వైపు నుంచి దేవరపల్లి వైపు వెళుతున్న డిల్లీ రిజిస్ట్రేషన్ వ్యాన్‌లో రూ.11.80 లక్షల విలువైన గంజాయిని 22 ప్లాస్టిక్ మూటలలో గుర్తించారు. బొప్పాయి రవాణ మాటున తరలిస్తున్న 589.94 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. గంజాయిని విశాఖ ఏజన్సీ నుంచి రాజమహేంద్రవరం వరకు కారులో తీసుకువచ్చి,బొప్పాయి లోడ్‌తో పాటు హైదరాబాద్‌కు వ్యాన్‌లో తరలిస్తున్నారన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాన్ డ్రైవర్ పాన్ సింగ్ అలియాస్ మన్‌సింగ్‌ను అరెస్టు చేశామన్నారు.ఈ కేసులో మరో నలుగురు ఉన్నట్లు గుర్తించామన్నారు.గంజాయి పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కొవ్వూరు రూరల్ సీఐ వైవి.రమణ, రూరల్ ఎస్‌ఐ కె.వెంకటరమణ,హెచ్‌సీ లు టి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, కానిస్టేబుల్స్ టి.శ్రీను, ఎస్.కృష్ణారావు, వి.శ్రీని వాస్, అఫ్సారీ బేగ్‌కు రివార్డులకు సిఫారసు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.