నదిలోకి దూసుకెళ్లిన ఇన్నోవా

TV77తెలుగు విజయవాడ: విజయవాడ నుంచి అవనిగడ్డ వస్తున్న ఓ ఇన్నోవా వాహనం.కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. మరొకరు గాయపడ్డారు. ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.ప్రవాహంలో వాహనం కొంత దూరం కొట్టుకెళ్లింది.గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలో ఘటన చోటు చేసుకుంది.వాహనంలో ప్రయాణిస్తున్న వారందరూ చిరువోలు గ్రామానికి చెందిన వారని, ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది.