ట్రైన్ కింద పడి నిందితుడు రాజు ఆత్మహత్య
iraila 16, 2021
TV77తెలుగు ఘన్‌పూర్: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం,హత్యకు పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు.ఈ సందర్భంగా సంఘటన ప్రదేశాన్ని పరిశీలించిన సీపీ తరుణ్ జోష్ మీడియాతో మాట్లాడుతూ ఘట్‌కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రాజారాం వంతెన రేల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైందన్నారు.మొహం గుర్తుపట్టలేనంతగా ఉందని,అయితే చేతిపై టాటూ,మనిషి పొడుగు అన్నీ సరిపోయాయన్నారు.రాజు కుటుంబ సభ్యులు కూడా గుర్తించారన్నారు.ఇది ఖచ్చితంగా ఆత్మహత్యేనని సీపీ స్పష్టం చేశారు.ఇక్కడికి ఎలా,ఎప్పుడు వచ్చాడు,ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నది విచారణ జరుపుతున్నామన్నారు.సీపీ కెమెరాలు పరిలీస్తామని చెప్పారు.గురువారం ఉదయం 8:45 గంటలకు కోరార్క్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట్ నుంచి సికింద్రాబాద్‌కు వస్తుందని.అదే సమయంలో రాజు ట్రాక్‌పై నడుచుకుంటు వెళుతుండగా రైల్వే సిబ్బంది చూసి పట్టుకోడానికి ప్రయత్నించారని.సాధ్యంకాలేదని, ట్రైన్ కింద పడి నిందితుడు రాజు చనిపోయాడని సీపీ తరుణ్ జోష్ పేర్కొన్నారు.