టీటీడీ నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది 25 మందితో
iraila 15, 2021
TV77తెలుగు తిరుపతి:
తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 25 మందితో నూతన పాలక మండలిని ఏర్పాటు చేశారు. బోర్డు సభ్యుల వివరాలను బుధవారం సాయంత్రం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారికంగా ప్రకటించనున్నారు. పాలకమండలిలో కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించినట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. గత పాలక వర్గంలో మొత్తం 36 మంది సభ్యులు ఉండగా అందులో 24 మంది పాలకమండలి సభ్యులు, 8 మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమితులయ్యారు. అయితే ఈసారి ఆ సంఖ్యను భారీగా కుదించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తూ పాలకమండలి కూర్పు చేసినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.