వినాయక చవితి ఉత్సవాలను పూర్తిగా కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని కమీషనరు ఎం అభిషిక్ కిశోర్

TV77తెలుగు రాజమహేంద్రవరం: నగర పౌరులు ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలను పూర్తిగా కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని మట్టితో తయారు చేసిన చిన్న విగ్రహాలు మాత్రమే ఉత్సవాలకు వినియోగించాలని నగర పాలక సంస్థ కమీషనరు ఎం అభిషిక్ కిశోర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన నగర పాలక సంస్థ కార్యాలయం నందు వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించి వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పౌరులు కోవిడ్-19 నిబంధనల నడుమ వినాయక చవితి ఉత్సవాలు గతంలో మాదిరిగా కాకుండా చిన్న చిన్న మట్టి విగ్రహాలతో నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గుంపులు ఏర్పడి పూజాధికార్యక్రమాలు నిర్వహణకు అవకాశం లేదని సూచించారు. పబ్లిక్ ప్రాంతాలలో విగ్రహాలు ఏర్పాటుకు అవకాశములేదని ఆయన స్పష్టం చేసారు. అదేవిధంగా అపార్టుమెంట్లలో కూడా సమూహంగా ఏర్పడి ఉత్సవాలు నిర్వహణకు వీలులేదన్నారు. ఇంటిలోనే పూజాధి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. పూజా సామాగ్రి పత్రి అమ్మే ప్రాంతాలలో డసుబిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పూజా సామాగ్రిని అమ్మే వర్తకులను చైతన్యపర్చి బౌతిక దూరాలు పాటించడం., శానిటైజర్లు వాడటం మాస్కు ధరించడం వంటి ప్రక్రియలు ఆచరిం పజేయాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో పెద్ద విగ్రహాలతో వినాయక చవితి ఉత్సవాలు నిషేధమని, అదేవిధంగా ఊరేగింపులు కూడా పూర్తిగా నిషిధమని ఆయన స్పష్టం చేసారు. స్నానఘట్టాల వద్ద శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. స్నానఘట్టాల వద్ద పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను ఏర్పాటుచేసి భక్తులకు సూచనలు నియమ నిబంధనలు తెలియబర్చాలన్నారు. స్నానఘట్టాల వద్ద అవసరమైన డస్టుబిన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. శానిటేషన్ కార్యదర్శులను శానిటేషన్ పర్యవేక్షణ కొరకు నియమించాలన్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని విగ్రహాలను మాత్రమే నిమజ్జనానికి అనుమతించాలని బయట ప్రాంతాలనుంచి వచ్చే విగ్రహాలను అనుమతించరాదన్నారు. ఇసుక రేవు వద్ద వైద్య శిభిరం, కంట్రోల్, పంటు, క్రైన్ ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక రేవు వద్ద ఇతర స్నానఘట్టాల వద్ద నిమజ్జనానికి ఎనిమిటీ కార్యదర్శులను నియమిస్తూ అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని వార్డులనుంచి వినాయక చవితి ఉత్సవాలు పై సమాచారాన్ని సేకరించి కోవిడ్-19 నిబంధనలు ప్రకారం ఉత్సవాలు నిర్వహిస్తున్నదీ లేనిదీ పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఎస్.ఇ ఓంప్రకాస్ ఎంహెచ్ఓ ఎ వినూత్న. సి.పి సూరజ్ కుమార్, జలవనరులు శాఖ డిఇఇ ఎం రాంబాబు, ఆర్ఎండ్ బి డిఇఇ బి. వి మదుసూదనరావు, డిఎస్పీ టి.వి సంతోష్, తాహసిల్దారు ఎ సుస్వాగతం మేనేజరు శ్రీనివాసరావు, నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.