18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలని సబ్ కలెక్టరు ఇలాక్కియా వైద్య సిబ్బందిని ఆదేశించారు
iraila 29, 2021
TV77తెలుగు కోరుకొండ:
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి, నియంత్రణ చర్యలలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి
వ్యాక్సిన్ వేయాలని సబ్ కలెక్టరు ఇలాక్కియా వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆమె మండల
పరిధిలోని కాపవరం గ్రామ సచివాలయంలో చేపట్టిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యాక్సిన్ వేసే ప్రక్రియను మమ్మరంగా
చేపట్టాలని ఆదేశించారు. ఈ టీకా కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు పలు కార్యాచరణ
ప్రణాళికలు అమలు జరుగుతున్నాయన్నారు. ఆన్లైన్ లో కూడా టీకా కొరకు నమోదు చేసుకొని తదుపరి
వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ మరియు ఆరోగ్య భద్రతల కొరకు సమర్ధవంతమైన చర్యలు చేపట్టిందని ఆదిశగా వైద్య సిబ్బంది పనిచేయాలని సూచించారు.కంటికి కనిపించని కరోనా వైరస్ శత్రువుపై యుద్ధం చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు
చేపట్టిందన్నారు. విపత్తు ఎదుర్కొవడమనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, కరోనా వైరస్ కట్టడిపై ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించి నియంత్రణ చర్యలు ఆచరింపజేయాలని సూచించారు. అర్హత వయస్సులుగలవారికి వ్యాక్సిన్ అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు తోడ్పాటునందించాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని,బౌతిక దూరాలు పాటించాలని, శానిటైజర్లు వాడాలని ఆమె సూచించారు. వ్యాక్సినేషన్ భద్రత, వాడకంలో దుర్వినియోగం కాకుండా వైద్య సిబ్బంది కీలకంగా వ్యవహరించాలన్నారు. గ్రామ సచివాలయం పనితీరు మెరుగుపర్చాలని, వాలంటీర్లు గ్రామ సచివాలయ ఉద్యోగులు సమస్వయంతో వారి పరిధిలోని కుటుంబాల
సర్వీసు రిక్వెస్టులపై సకాలములో స్పందించి పరిష్కరిస్తూ పెండింగులకు తావులేకుండా ఎప్పటికపుడు అధికారుల
సహకారంతో తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, ప్రతి కుటుంబానికి
సంక్షేమ పథకాల లబ్దిని చేకూర్చేందుకు, గాందీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన కొరకు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ అవిర్భవించిందన్నారు. గ్రామ వాలంటీర్లు తమ పరిధిలోని 50 కుటుంబాలలో సమస్యలను తెలుసుకొని వారికి కావాల్సిన ప్రాధమిక కనీస సేవలను గ్రామ సచివాలయాల సహకారంతో అందించి,ఆర్ధిక, ఆరోగ్యపరంగా జీవనాన్ని సాగిస్తూ వారి జీవనశైలిలో సుస్థిరాభివృద్ధిని సాధించేలా తోడ్పాటు నందించాలన్నారు. ప్రభుత్వ పాలన ప్రజల వద్దకు చేర్చేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు
కాబడిందన్నారు. శ్రీరంగపట్నం గ్రామంలోని బురద కాలువకు గండి పడిన కారణంగా ఎస్.సి కాలనీ వాసులు
200 మంది ముంపు బారిన పడ్డారని వారిని సురక్షితంగా మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలకు చేర్చి,
వారికి తాత్కాలికంగా పునరావాస కేంద్రాన్ని రెవిన్యూ సిబ్బంది ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆమె ముంపు బాదితులు యోగ క్షేమాలను అడిగి తెలుసుకొని భాదితులకు పునరావాస కేంద్రాలలో వసతి తదితర సౌకర్యాలు కల్పించాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల
తాహసిల్దారు పాపారావు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.