17 మోటార్ సైకిళ్ళు స్వాధీనం

TV77తెలుగు కడియం: తూర్పుగోదావరి జిల్లా. కడియం వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన 17 మోటార్ సైకిళ్లను కడియం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కడియం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డి.ఎస్.పి ఎం.శ్రీలత ఈ కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కడియం రైల్వే స్టేషన్ సమీపాన కెనాల్ రోడ్ నందు మంగళవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామానికి చెందిన పాత నేరస్తుడైన కోరాడ వెంకటేశ్వర్లు (As) శేఖర్ ను దొంగిలించిన మోటార్ సైకిల్ తో అదుపులోనికి తీసుకొని అతని సమాచారం మేరకు రంగాపురం , చండ్రేడు , రాయవరం , ఎన్.టి. రాజాపురం గ్రామాలలోని వ్యక్తుల నుండి 17 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మోటార్ సైకిళ్ళు , కడియం , రావులపాలెం , పెదపూడి , సర్పవరం , రామచంద్రపురం , అనపర్తి , మండపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగలించబడినవన్నారు. నిందితునిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కడియం సి.ఐ కే.శ్రీధర్ కుమార్ , సి.సి.ఎస్ 2 టౌన్ సి.ఐ రాంబాబు , కడియం ఎస్.ఐ కే.నాగరాజు మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కేసును ఛేదించిన. కడియం పోలీస్. హెడ్ కానిస్టేబుల్. ఉదయ భాస్కర్. కానిస్టేబుల్స్ . సురేష్. అమర్.ను డీఎస్పీ శ్రీలత అభినందించారు.