పోలీసులు అదుపులో నూతన వధూవరులు

గుంటూరు.. కడప జిల్లా‌కు చెందిన నూతన వధువరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జంట 14న కాణిపాకంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు వివాహాన్ని అంగికరించలేదు. యువతి బంధువుల నుంచి ప్రాణహాని ఈ జంట హైకోర్టు‌ను ఆశ్రయించింది. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పెదకాకాని రెయిన్ ట్రీ పార్క్ విల్లాస్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ జంటది కడప జిల్లా దిగువ నల్లగుట్ట గ్రామం. అయితే పోలీసుల తీరుపై న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.