లెజెండ్ అవార్డ్ స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కి
abuztua 25, 2021
25/8/2021
స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కి లెజెండ్ అవార్డ్
తెలంగాణరాష్ట్ర స్థాయి లెజెండ్ సేవా అవార్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశిష్ట సేవలందిస్తున్న స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కు) లభించింది. తెలంగాణ రాష్ట్ర స్వచ్చంద సేవ సమితి లెజెండ్ ఇంటర్ నేషనల్ సంస్థ బుధవారం రోజున స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కు అవార్డ్ ఇచ్చి సత్కరించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు ఈ అవార్డు ప్రధానోత్స్వ కార్యక్రమం జరిగింది. ఈ అవార్డును స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ స్వర్ణలత అందజేశారు. ఈ అవార్డు వేడుకలో 148 స్వచ్ఛంద సేవ సంస్థలు పాల్గొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తెలుగు రాష్ట్రాల్లో సేవలందిస్తున్న స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నుంచి సేవలు పొందిన వారు పెద్ద ఎత్తున పాల్గొనటం జరిగటం కొసమెరుపు.