నిహారిక భర్త కేసులో రాజీ కుదుర్చుకున్న ఇరువర్గాలు

TV 77 NEWS : హైదరాబాద్: మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ కేసులో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్‌ను చైతన్య అద్దెకు తీసుకున్నారు. అయితే అపార్టుమెంట్‌లో ఆఫీస్ పెట్టటానికి వీలు లేదని అపార్టుమెంట్ వాసులు చైతన్యతో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే చైతన్యకు, అపార్టుమెంట్ వాసులకు మధ్య గొడవ జరిగింది. తమ ఆఫీస్‌లోకి అక్రమంగా ప్రవేశించి గొడవకు దిగారని చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అపార్ట్‌మెంట్‌‌లో న్యూసెన్స్ చేస్తున్నారని అపార్టుమెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా నిహారిక భర్త చైతన్య ఉండే ఫ్లాట్‌కు కొంతమంది యువకులు వస్తున్నారని... వచ్చిన ప్రతిసారీ మద్యం సేవించి నానా హంగామా సృష్టిస్తున్నారని అపార్టుమెంట్‌వాసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం నాడు జరిగిన వాగ్వాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. ఇరువురినీ స్టేషన్‌కు పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ చేశారు. అనంతరం ఇరువురూ రాజీకి వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.