ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం
abuztua 28, 2021
విశాఖపట్నం: వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మంగళవారం వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు సముద్రం అలజడిగా ఉంటుంది. రేపటి వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.....