చిరుత కదలికలను స్థానికులు గుర్తించారు
abuztua 28, 2021
తిరుమలలో గత కొద్దిరోజులుగా చిరుతల సంచారం కలకలం రేపుతోంది. పద్మావతి అతిథి గృహాల దగ్గర చిరుత కదలికలను స్థానికులు గుర్తించారు. శుక్రవారం రాత్రి అడవిపందిని వేటాడేందుకు చిరుత యత్నించింది. చిరుతను చూసి భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల తిరుమల సన్నిదానం అతిథి గృహం వద్ద చిరుత హల్‌చల్ చేసింది. అడవిపందిని నోటికి కర్చుకుని చిరుత సన్నిదానం అతిథి గృహం సెల్లార్ వద్దకు వచ్చింది. చిరుతను చూసి భక్తులు, తిరుమల సిబ్బంది పరుగులు తీశారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. అయితే చిరుతల కదలికలు భక్తులను కలవరపెడుతున్నాయి.