పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తోన్న తిరుపతి దేవస్థానం

తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తోన్న తిరుపతి దేవస్థానం.. ఆలయ అవసరాల నిమిత్తం తాజాగా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఆర్టీసీ ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను ఘాట్ రోడ్డులో నడపాలని పాలకమండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా 35 టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసింది. టీటీడీ పరిధిలోని డెప్యూటీ ఈవో స్థాయి అధికారులుకు ఈ ఎలక్ట్రిక్ కార్లను టీటీడీ కేటాయించనుంది. ఐదు సంవత్సరాల పాటు నెలకు ఒక కారుకు 35 వేల రూపాయల చొప్పున టాటా కంపెనీకి టీటీడీ నగదు బదిలీ చేయనుంది. మరోవైపు, ప్రస్తుతం వినియోగిస్తున్న డీజిల్ కార్లను తిరుమల నుంచి అంచెలంచెలుగా టీటీడీ తొలగించనుంది. తిరుపతిలోని టాటా షోరూం నుంచి కొనుగోలు చేసిన ఈ ఎలక్ట్రిక్ కార్లను సోమవారం ఉదయం శ్రీవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ అధికారులకు అందజేయనున్నారు...