పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా... రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అమిత్ అనే యువకుడి తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. ఆపై పోలీస్ స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయాడు. ఈ ఘటన హైదర్ ఎంక్లేవ్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.....