డీజిల్ దొంగల ముఠా అరెస్ట్

సూర్యాపేట జిల్లా... డీజిల్‌ను దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠాను మునగాల పోలీసులు అరెస్ట్ చేసారు.రాత్రి సమయంలో రోడ్డు వెంట ఆగి ఉన్న లారీల నుంచి ఈ ముఠా డీజిల్ దొంగతనం చేస్తున్నదని పోలీసులు తెలిపారు.మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా, తెరికాడ్‌కు చెందిన 6 గురు నిందితులలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.వారి వద్ద నుంచి రెండు లారీలు,2 సెల్ ఫోన్లు, రూ.30వేల నగదు,డీజిల్ దొంగిలించే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.....