విరాట్ కోహ్లీని టార్గెట్

*TV77తెలుగు* ఎప్పుడు ఏదో వివాదంలో వేలుపెట్టే నటి శ్రీ రెడ్డి లేటెస్ట్ గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసింది. ఇంగ్లండ్ జరిగిన మూడవ టెస్ట్ లో ఓటమిపై కామెంట్ చేస్తూ సారథిగా విరాట్ కోహ్లీ పనికిరాడని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్విటర్ వేదికగా స్పందించిన ఆమె.. విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కోహ్లీ ఓ చెత్త ఆటగాడని, అతని బ్యాటింగ్ పరమ చెత్తగా ఉందని, రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని కామెంట్ చేసింది. అంతేకాకుండా కోహ్లీ చెత్త పరమ చెత్త ఆటగాడు అంటూ తన ఆగ్రహాన్ని వెల్లగక్కింది.