1500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం.70 లీటర్ల సారా స్వాధీనం

*1500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం.* --70 లీటర్ల సారా స్వాధీనం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు (ఎక్సైజ్ సర్కిల్ పరిధి) మండలంలోని పినపల్లలో బుధవారం ఆలమూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు సారా తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. స్థానిక ఎస్ఈబీ సీఐ కె.శ్రీధర్, ఎస్సై కె అన్నవరం కథనం ప్రకారం గ్రామ శివార్లలోని మురుగు కాలువ సమీపంలో సారా తయారీ చేస్తున్నారన్న సమాచారంతో ఎస్ఈబీ అధికారులు, సిబ్బంది దాడి చేశారు. ఈదాడిలో సారా తయారీకి సిద్దంగా ఉన్న 1500 లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసంచేశారు. నిర్వాహకుడు కోట వీరపండు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములను, వంట పాత్రలను ద్వంసం చేశారు. వీరపండుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ పేర్కొన్నారు. ఎస్ఈబీ సిబ్బంది రాజు, నాగేశ్వరరావు, వెంకటేష్, సి.దేవి తదితరులు పాల్గొన్నారు.