'సదర్'కు రాష్ట్ర పండుగ హోదా


రాష్ట్ర ప్రభుత్వం సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించింది. ఈ మేరకు ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జీవో జారీ చేసింది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లా కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమిషనరు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఎంపీ అనిల్ కుమార్ విజ్ఞప్తితో అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయమై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.