అకౌంట్లోకి డబ్బులు ప్రభుత్వం కీలక నిర్ణయం

 


విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కాలేజీల ఖాతాల్లోకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించే ఫైలుపై ఇవాళ క్యాబినెట్ సమావేశంలో చర్చించి, ఆమోదించనుంది. ప్రస్తుత విధానంతో కాలేజీలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి చేయడంతో కొందరు పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం దృష్టికి రావడంతో కాలేజీలకే చెల్లించాలని చూస్తోంది.