హైదరాబాద్ మధురానగర్లో దారుణం జరిగింది. ఓ మహిళ(50)పై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. కూలీ చేసుకునే సదరు మహిళ కొండాపూర్లో పని ముగించుకుని నిన్న రాత్రి ఇంటికి వస్తుండగా ముగ్గురు అడ్డుకున్నారు. తమ గదిలో బట్టలు ఉతకాలని, డబ్బులు ఇస్తామని తీసుకెళ్లి ఓ రూమ్లో బంధించారు. అనంతరం నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.