జగన్నాథపురంలో దీపం-2 పథకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఊహించని అనుభవం ఎదురైంది

 


ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో దీపం-2 పథకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఊహించని అనుభవం ఎదురైంది. వేదికపై ఆయన ప్రసంగిస్తుండగా అభిమానులు 'ఓజీ.. ఓజీ' అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పందించిన పవన్ 'సినిమాలు సరదా కోసమే. అవే జీవితం కాదు. అందరూ భగవంతుని నామస్మరణ చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మన జీవితాలు కూడా బాగుపడతాయి' అని పేర్కొన్నారు.