పార్టీని ఇబ్బంది పెట్టేలా స్టేట్మెంట్స్ ఇస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలకు CM రేవంత్, TPCC చీఫ్ మహేశ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. సమంతపై మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ల విషయంలో మాజీ MLA జగ్గారెడ్డి కామెంట్స్ దుమారం లేపిన విషయం తెలిసిందే.