రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. ఎప్పుడంటే?

 జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ధాన్యం సేకరిస్తోందని, ఈ సీజన్లో 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రతి ఏటా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకొస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.