ఇసుకను వినియోగదారులకు ఆఫ్లైన్ బుధవారం నుంచి ప్రారంభించినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ చిన్న రాముడుతో కలిసి క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్ కోసం, ఆఫ్ లైన్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, ఎటువంటి ఆటంకం లేకుండా ఇసుక సరఫరా విధానం అత్యంత పారదర్శకంగా నిర్వహించారు.