నేడు కోర్టుకు నందిగం సురేశ్


వైసీపీ నేత నందిగం సురేష్ ను ఈరోజు పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. 2020లో జరిగిన ఘర్షణల విషయంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత మంగళగిరి కోర్టులో హాజరుపరుస్తారు. రెండు రోజుల పోలీసుల కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టుకు తీసుకొస్తున్నారు. కాగా విచారణలో తేలిన అంశాల ఆధారంగా త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.