తీవ్ర తుఫాన్.. అర్ధరాత్రి లేదా ఉదయం తీరం దాటే అవకాశం!
urria 24, 2024
బంగాళాఖాతంలోని తీవ్రతుఫాన్ 'దానా' పారాదీప్ (ఒడిశా)కు 100 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయంలోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఏపీలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.