ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆ జట్టుకు మళ్లీ కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన జట్టు మేనేజ్మెంట్కు సమాచారమిచ్చినట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. 2022 నుంచి ఆ జట్టుకు డు ప్లెసిస్ కెప్టెన్సీ చేస్తున్నారు. కెప్టెన్లు మారుతున్నా కప్పు కొట్టడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో మరోసారి తానే కెప్టెన్గా కప్పుకోసం ట్రై చేయాలని కోహ్లి భావిస్తున్నట్లు సమాచారం.