పాలు తాగే చిన్నబాబు ఉన్నాడు. ప్లీజ్ వదిలేయండి

సచివాలయం వద్ద ఆందోళన చేస్తున్న బెటాలియన్ పోలీసుల కుటుంబీకులను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాలకు తరలిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ మహిళను అదుపులోకి తీసుకొని వ్యాన్ ఎక్కించారు. దీంతో ఆమె 'నాకు పాలు తాగే చిన్న బాబు ఉన్నాడు.. వదిలేయండి ప్లీజ్' అని వేడుకున్నారు. అక్కడున్న మీడియా సిబ్బంది కూడా ఆమెను వదిలేయాలని కోరారు. అయినా పోలీసులు వినకుండా ఆమెను వ్యాన్లో తీసుకెళ్లారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.