హైదరాబాదులో సాఫ్టవేర్ ఉద్యోగులు చేస్తున్న తూ.గో జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు గంజాయి విక్రయిస్తూ గురువారం పోలీసులకు చిక్కారు. కేపీహెచ్బీలోని పలువురు యువకులు గంజాయి పొట్లాలతో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆలమూరు మండలానికి చెందిన తోరటి రాజేశ్ (24), కొత్తపల్లి మండలానికి చెందిన నక్కా నాగవంశీ (23), రాజమహేంద్రవరం కి చెందిన తంగెళ్ల రమేశ్ గా గుర్తించారు.