గత 3 వారాలుగా రాజమహేంద్రవరం నగరంలో పలు రోడ్డు పై ఉన్న ఆక్రమణలను రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం తొలిగిస్తుంది. శుక్రవారం స్టేడియం రోడ్డు పై ఉన్న ఆక్రమణలను తొలిగింపు చర్యలను చేపట్టింది. రోడ్డు మార్జిన్ దాటి ఉన్న వ్యాపార ఫ్లెక్సీలు, డ్రైన్ పై కట్టిన స్లాబులు, షాప్ బోర్డులు, వ్యాపారాలు నియమాలకు విరుద్ధంగా కట్టిన కట్టడాలను తొలిగిస్తున్నారు.