రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రం వద్ద తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మద్యం షాపుల లైసెన్సుల లాటరీ ప్రక్రియను కలెక్టర్ ప్రశాంతి పర్యవేక్షణలో సోమవారం ఉదయం అధికారులు నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 125 మద్యం షాపుల ఏర్పాటుకు గాను 4384 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మండలాల వారిగా ఈ లాటరీ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.