రెండో వారంలో ఏపీ పూర్తిస్థాయి బడ్జెట్!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను నవంబర్ రెండో వారంలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల దృష్ట్యా గత ప్రభుత్వం ఏప్రిల్-జులై వరకు, కూటమి ప్రభుత్వం ఆగస్టు-నవంబర్ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సమర్పించిన విషయం తెలిసిందే. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్లో అమరావతి, పోలవరం, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు చేస్తారని సమాచారం.