టీతోపాటు సిగరెట్ తాగుతున్నారా?


చాలా మంది టీ తాగుతూ సిగరెట్ కాలుస్తుంటారు. కానీ దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల భవిష్యత్లో క్యాన్సర్, నపుంసకత్వం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవి శరీరంలో జీర్ణ కణాలనూ దెబ్బ తీస్తాయి. దీంతో అజీర్తి, మలబద్దకం, అల్సర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ అలవాటు మానలేకపోతే డాక్టర్ను సంప్రదించాలి.