రన్ మెషీన్ విరాట్ కోహ్లి గురించి టీన్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. '2008లో కోహ్లి అరంగేట్రం చేసినప్పటి నుంచి అతడిపై నా అభిప్రాయం మారలేదు. విరాట్ ప్రపంచ స్థాయి క్రికెటర్. శ్రీలంకపై తొలిమ్యాచ్లోనే ఆయనతో ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడం నాకింకా గుర్తుంది. ఎప్పుడూ పరుగుల ఆకలితో ఉండటం ఆయన్ను దిగ్గజ క్రికెటర్ను చేసింది. NZ, AUS టెస్టు సిరీస్లోనూ కోహ్లి రాణిస్తారు' అని తెలిపారు.