కాకినాడ DFO డి.రవీంద్రనాథ్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. ఇటీవల బదిలీపై కాకినాడకు వచ్చిన ఆయన పవన్తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయంటూ
మైనింగ్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. తన పేరు, పేషీ పేరు వాడటంపై ఆగ్రహించిన పవన్, విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటు తన పేరుతో అవినీతికి పాల్పడితే చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.