రాజమహేంద్రవరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కోరుకొండ రోడ్డులోని శ్రీ సాయి కనకదుర్గ ఆలయంలో జిల్లా జడ్జి గంధం సునీత ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి వచ్చేసిన జిల్లా జడ్జి సునీతకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం
పలికారు.అనంతరం జిల్లా జడ్జి గంధం సునీత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు దుద్దిపూడిశ్రీనివాస్, పద్మావతి,మాజీ కార్పొరేటర్లు కంటిపూడి పద్మావతి శ్రీనివాస్,జవ్వాది మురళీకృష్ణ,విజయలక్ష్మి, జొన్నాడ వీర వెంకట సుబ్బారావు, శ్రీదేవి,ఆకుల రాజు, జొన్నాడ దుర్గ, పినిశెట్టి సుబ్బరాజు, సత్తిసత్యనారాయణ, కాలెపు రవి, రాయుడు,మార్నిడి బాల, సుభాషిణి, పద్మావతి, దేవి,రాజీ, వి.భీమశంకర్, బి.సురేష్, బ్యాంకు వెంకటేశ్వరరావు, బ్యాంకు సత్యనారాయణ,భీమవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.