దేవీపట్నం మండలంలో గోదావరి వరద భారీగా తగ్గుతుంది. గత 3 రోజుల నుంచి నీటిమట్టం భారీగా తగ్గిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రసిద్ధ పుణ్య క్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద వరద నీరు తగ్గుముఖం పట్టిందని దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తులెవరూ అమ్మవారి దర్శనాలకు రావద్దన్నారు. అమ్మవారి ఆలయం వద్ద ఇంకా వరదనీరు ఉందని, తగ్గాక దర్శనాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.