మేం ఎవరికీ B టీమ్ కాదు: హీరో విజయ్


వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ చేస్తుందని హీరో, ఆ పార్టీ చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. తాము ఎవరికీ A టీమ్, B టీమ్ కాదన్నారు. విల్లుపురం మహానాడులో ఆయన మాట్లాడారు. 'రాజకీయాల్లో నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. అయినా వాటి గురించి పట్టించుకోను. రాజకీయాలు పాముతో సమానమని నాకు తెలుసు. దేవుడు లేడనే పెరియార్ సిద్ధాంతాలకు మేం వ్యతిరేకం. మత రాజకీయాలను ప్రోత్సహించం' అని ఆయన పేర్కొన్నారు.