రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు చేయగా, రూ.5కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఆయన రూ.8లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే.