పేలిన బాణాసంచా, 150 మందికి గాయాలు

 


కేరళ కాసరగోడ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నీలేశ్వర ఆలయంలో కాళీయపట్ట ఉత్సవాల్లో టపాసులు కాల్చడంతో అవి పక్కనే బాణాసంచా నిల్వ ఉంచిన ప్రదేశంలో పడ్డాయి. దీంతో ఒక్కసారిగా పేలుడు జరిగి 150 మందికి పైగా గాయపడ్డారు. అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. బాణాసంచా పేలుతున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.