సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా

 


తన క్యారెక్టర్పై చేస్తున్న నిరాధార ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు పేర్కొన్నారు. గత కొంత కాలంగా తన క్యారెక్టర్ను దిగజార్చేందుకు సోషల్ మీడియాలో చేసే ప్రయత్నాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. కోర్టులో నిజం గెలుస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.