TV77 తెలుగు సామర్లకోట:
కాకినాడ జిల్లా. సామర్లకోట బులుసులపేటలో చర్చి కూలిన ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.చర్చి గోడకు మరమ్మత్తులు నిర్వహిస్తున్న సమయంలో గోడ కూలిపోయింది. దీంతో శిధిలాల కింద పడిన కార్మికులు మచ్చా నాగేశ్వరరావు, పిట్ల అర్జున్రావులు మరణించినట్లు స్థానికులు వెల్లడించారు. బాధిత కుటుంబ సభ్యులను నియోజకవర్గ ఇంఛార్జ్ దవులూరి దొరబాబు పరామర్శించారు.