TV77 తెలుగు రాజమండ్రి :
సీఐడీ పోలీసులు ఆదివారం ఉదయం ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి అప్పారావులను అరెస్ట్ చేయడంతో రాజమహేంద్రవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత రాజమహేంద్రవరం సీఐడీ ఆఫీసుకు ఇద్దరిని తరలించారు. దీంతో ఆదిరెడ్డి అభిమానులు, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున సీఐడీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అప్పారావు, వాసులను అక్రమంగా అరెస్ట్ చేశారని నేతలు మండిపడుతున్నారు.