వైఎస్సార్ ఆసరా మూడో విడత


 Tv77 తెలుగు ఏలూరు:

వైఎస్సార్ ఆసరా మూడో విడత కింద 78.94 లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ. 6,419 కోట్ల మొత్తాన్ని CM జగన్ జమ చేయనున్నారు. ఈనెల 25న ఏలూరు జిల్లా దెందలూరులో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏప్రిల్ 5 వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నగదు పంపిణీ కొనసాగుతుంది. 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాలకు ఉన్న అప్పును చెల్లిస్తామని హామీ ఇచ్చిన మేరకు 2 విడతల్లో రూ.12,758 కోట్లు జమ చేశారు..