కాతేరు సమస్యలపై బిజెపి వినతి


 Tv7 7తెలుగు రాజమహేంద్రవరం రూరల్ 

   రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామపంచాయతీలో  పలు సమస్యలపై సెక్రటరీ కి  రాజమహేంద్రవరం రూరల్ బిజెపి నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని శ్రీదేవి నగర్ బీసీ కాలనీ లో  కాలనీ వచ్చి 30 సంవత్సరాల దాటుతున్న 2 వీధులకు పైపులైన్లు లేక త్రాగునీటి ఇబ్బంది పడుతున్నారని,  కాలనీకి వచ్చే రహదారి సరిగ్గా  లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని  కనీసం గ్రావెల్ రోడ్డు అయినా వేయాలని వినతిపత్రంలో కోరారు.  కాతేరు చివరి ప్రాంతం జలుకాలువ వద్ద కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే వాటర్ ట్యాంకు రావడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు  వారానికి రెండుసార్లు వాటర్ ట్యాంకు పంపించాలని కోరారు. వేణు గోపాల పురం హై స్కూల్, కాలనీవాసులు డ్రైనేజీ సౌకర్యం లేక వాడుక నీళ్లు రోడ్డుపైన ఖాళీ స్థలాల్లో నీరు ఉండిపోవడం వలన దోమలు పందులతో విష జ్వరాల బారిన పడే   ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.  వడ్డీలపేట, గణపతి నగర్, మల్లయ్యపేట,  బాబూ జగజ్జీవన్ రామ్ కాలనీ ప్రాంతాలలో డ్రైనేజీలో అలాగే  రోడ్లపై చెత్త పేరుకుపోయి అస్తవ్యస్తంగా తయారైందని పేర్కొన్నారు.   వీధిలైట్స్ అక్కడక్కడ వెలగడం లేదని,  వీటిపై తక్షణమే ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో  రాజమహేంద్రవరం రూరల్ మండలం అధ్యక్షులు యానాపుఏసు, వైస్ ప్రెసిడెంట్ సోమ్ సతీష్. ఎస్సీ మోర్చా నాయకులు కండెల రామారావు, ఓబిసి మోర్చా  నాయకులు భీమవరపు సూరిబాబు, గుంజే నాగరాజు,  మలువలస రాంబాబు,  బందరు అప్పారావు,  పి. నాగేశ్వరరావు, పిచ్చికి వెంకట రాంబాబు, మహిళా మోర్చా జిల్లా నాయకులు ఆకుల నర్సవేని తదితరులు పాల్గొన్నారు.